Take a fresh look at your lifestyle.

బావోజి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి -కలెక్టర్ సిక్తా పట్నాయక్

 

ముద్ర, నారాయణ పేట :

నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలోని తిమ్మారెడ్డి పల్లి లో ఏప్రిల్ 1 నుంచి 4 వరకు జరిగే శ్రీ గురు లోక్ మాసంద్ ప్రభు ( బావోజి) బ్రహ్మోత్సవాలకు అధికారులు పగడ్బందీగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. నాలుగు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం ఆలయ అవరణలో సంబంధిత శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులతో ఉత్సవాల ఏర్పాట్ల గురించి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి శాఖకు సంబంధించిన అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, నిర్వహణ కు నోడల్ అధికారి పర్యవేక్షణలో అన్ని శాఖల అధికారులు జాతర ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా వి.ఐ.పి మేనేజ్ మెంట్ జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. దేవాదాయ శాఖ పరంగా ఏం ఏర్పాట్లు చేశారని అడిగారు. ఆలయానికి, రథానికి కలర్స్ వేయిస్తున్నామని, మిగతా జాతర ఏర్పాట్లు చేస్తున్నామని ఈ.వో తెలిపారు. జాతర కోసం తమ శాఖ నుంచి మొత్తం 15 మంది ఉద్యోగులు సిబ్బందిని డిప్యూట్ చేయగా ప్రస్తుతానికి ఇద్దరు వచ్చి విధుల్లో చేరారని, మిగతా 13 మంది రెండు రోజుల్లో వస్తారని ఈ.వో తెలిపారు. గతేడాది మాదిరిగానే ఈ సారి ఆలయంలో సీసీ కెమెరాలు అమర్చుతామని ఈ. వో తెలపగా, పోలీసు శాఖ కోరినట్లు మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మిషన్ భగీరథ పరంగా బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు నీటి వసతి కొరకు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూడాలన్నారు. డోర్స్ తదితర దానికి సెప్టిక్ ట్యాంక్ మెయింటెనెన్స్ గ్రామపంచాయతీ వాళ్ళు చూసుకోవాలన్నారు. డిఆర్డిఏ ఆధ్వర్యంలో ప్రాజెక్టు డైరెక్టర్ మొబైల్ టాయిలెట్స్ బస్సు ట్యాంకర్ దగ్గర బట్టలు మార్చుకొనుటకు వెదురు తడకలతో తాత్కాలిక బాత్రూమ్ స్ ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ శాఖ ఎస్ ఈ ఆధ్వర్యంలో విద్యుత్ సరఫరా కై 20 మంది సిబ్బందిని ఏర్పాటు చేయాలని మొబైల్ ట్రాన్స్ఫార్మర్, లుస్ లైన్స్ లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. రవాణా సంస్థ వారు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని తెలిపారు. తాసిల్దార్ కొత్తపల్లి కంట్రోల్ రూమ్ చూడాలని మద్దూర్ ఎంపీడీవో జాతర అయిన తర్వాత కూడా సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. బడ్జెట్ కొరకు దేవాదాయ శాఖ తయారు చేయాలని రెగ్యులర్ ఈవో ఉండాలని దేవాలయ ఫౌండర్ మాజీ చైర్మన్ ఆఫ్ టెంపుల్ గోపాల్ కోరినారూ. ఎక్సైజ్ శాఖ రెండు మొబైల్ టీమ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. పోలీస్ శాఖ సీసీ కెమెరాలు బార్కెట్లు బందో బస్తు పార్కింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.