Take a fresh look at your lifestyle.

ఐబొమ్మ రవికి బెయిల్

షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసిన హైకోర్టు
వంద రోజుల తర్వాత విడుదల బయటికి రవి

ముద్ర, తెలంగాణ బ్యూరో :

పైరసీ సినిమాల వెబ్ సైట్ నిర్వాహకుడు రవికి ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. పైరసీ కేసులో గతేడాది నవంబర్ 16న అరెస్ట్ అయి.. వంద రోజుల నుంచి జైలులో ఉన్న ఆయనకు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్ మంజూరు సమయంలో హైకోర్టు రవికి కీలక సూచనలు చేసింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ భారతదేశం విడిచి బయటికి వెళ్లొద్దని ఆదేశించింది. ఈ క్రమంలోనే తన పాస్‌పోర్టును కోర్టులో అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత ప్రతి రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ సీసీఎస్‌ పోలీసుల ముందు హాజరు కావాలని తేల్చి చెప్పింది. ఇదీలావుంటే.. సినిమాలను ఐబొమ్మ రవి పైరసీ చేయడంతో సినిమా ఇండస్ట్రీకి రూ.వేల కోట్ల నష్టం వచ్చినట్లు హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. సినిమాలు పైరసీ చేసి.. వాటిని ఐబొమ్మ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసేవాడని తెలిపారు. బెట్టింగ్ యాప్‌ల ద్వారా రవి రూ. కోట్ల సొమ్మును దాచినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇలా అక్రమంగా పోగు చేసిన డబ్బులతో రవి భారతదేశం విడిచిపారిపోయాడని.. అండమాన్ నికోబార్ దీవుల్లోని ఒక ద్వీపంలో నివసిస్తున్నట్లు తేలింది. అక్కడే పౌరసత్వం కూడా తీసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. అతడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేయగా.. అరెస్ట్ చేయడాని కంటే ముందు ఐబొమ్మ వెబ్‌సైట్‌లో.. దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకే సవాల్ విసిరాడు. దీంతో ఈ కేసును మరింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హైదరాబాద్ ఐబొమ్మ రవిని పక్కా ప్రణాళికతో అరెస్ట్ చేశారు. పోలీసులు రవిని కస్టడీలోకి తీసుకుని విచారణ చేసినప్పటికీ అతడి నుంచి పూర్తిగా వివరాలను రాబట్టలేకపోయారు. ఏది అడిగినా తనకు తెలియదని.. తనకు సినిమాల పైరసీతో ఎలాంటి సంబంధం లేదని చెప్పడం గమనార్హం. అరెస్ట్ అయినప్పటి నుంచి పలు మార్లు బెయిల్ కోసం రవి ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఎదురుదెబ్బలే తగిలాయి. ఇక తాజాగా ఎట్టకేలకు అతడికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదల కానున్నాడు.

Leave A Reply

Your email address will not be published.