మాదాపూర్, ముద్ర విలేఖరి: ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఈస్ట్ సాయి నగర్, మొగులమ్మ బస్తీ, పీజేఆర్ నగర్, దత్తాత్రేయ నగర్, శంషిగూడా ఇంద్రహిల్స్, హెచ్ఎంటి శాతవాహన నగర్, జయ నగర్ కాలనీలలో రూ. 2 కోట్ల 48 లక్షల 70 వేల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణము పనులకు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ.ఈ సందర్భంగా పీయేసీ చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గం మరియు కాలనీ ల అభివృద్దే ధ్యేయంగా ప్రజల సౌకర్యార్థం 2 కోట్ల 48 లక్షల 70 వేల రూపాయల తో ఈస్ట్ సాయి నగర్, మొగులమ్మ బస్తీ, పీజేఆర్ నగర్, దత్తత్రేయ నగర్,శంషిగుడా ఇంద్రహిల్స్, హెచ్ఎంటి శాతవాహన నగర్, జయ నగర్ కాలనీల లో సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగినది అని, సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, కాలనీ వాసులకు ఉపశమనం లభించింది అని, మౌళిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తానని చైర్మన్ గాంధీ అన్నారు. సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకం లో శేరిలింగంపల్లి నియోకజకర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని గాంధీ తెలియచేసారు. మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, సీసీ రోడ్లు వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని, ప్రజలకు ట్రాఫిక్ రహిత ,సుఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని,అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానన్నారు.పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గాంధీ అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని, నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, అన్నివేళలో ప్రజలకు అందుబాటులోకి ఉంటానని, మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, ఆల్విన్ కాలనీ డివిజన్ మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని గాంధీ పునరుద్ఘాటించారు.
- స్ప్రింగ్ వ్యాలీ కాలనీలోనూ శంకుస్థాపనలు:
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని స్ప్రింగ్ వ్యాలీ కాలనీ లో రూ. 80.00 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణము పనులకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన పీయేసీ చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ.ఈ సందర్భంగా చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గం మరియు కాలనీ ల అభివృద్దే ధ్యేయంగా ప్రజల సౌకర్యార్థం 80 లక్షల రూపాయల తో స్ప్రింగ్ వ్యాలీ కాలనీ లో సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని, అందులో భాగంగానే సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేసుకున్నామన్నారు.సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి మార్గదర్శకం లో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితామని అన్నారు.
