ఆలేరు. ముద్ర.. తపాస్ పల్లి రిజర్వాయర్ నుండి ఆలేరు నియోజకవర్గంలోని గంధమల్ల చెరువు నింపడంతో ఆ చెరువు గత కొన్ని రోజులుగా అలుగు పోయడంతో ఆలేరు నుండి సిద్దిపేటకు వెళ్లే ప్రధాన రహదారి ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామ శివారులోని పెద్ద వాగు ప్రవహించడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ద్విచక్ర వాహనాలపై పయనించే ప్రయాణికులు నిత్యం నీటి ప్రవాహంతో తమ ద్విచక్ర వాహనాలతో సహా కొట్టుకుపోవడంతో సమీపంలోని స్థానికులు వారిని రక్షించడం, చికిత్స కోసం హాస్పిటల్ కు పంపించడం షరా మామూలుగా జరుగుతుంది. ప్రధాన రహదారిపై హై లెవెల్ వంతెన నిర్మించాల్సిన అవసరం ఉన్న పట్టించుకోకపోవడంతో రోజుకో ప్రమాదాలు జరగడం నిత్య కృత్యం అవుతున్నాయి. వెంటనే ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి హై లెవెల్ వంతెనను నిర్మించేందుకు కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు….