- తాటికొండ సీతయ్య మాజీ ఎంపీపీ బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు
తుంగతుర్తి, ముద్ర: తుంగతుర్తి ప్రాంత రైతాంగం వేసుకున్న వరి పంటలను కాపాడే విధంగా ఎస్ ఆర్ ఎస్ పి రెండవదశ కాలువల ద్వారా పంట పొలాలకు ఏప్రిల్ నెలాఖరు వరకు నీళ్ళివ్వాలని లేదా కనీసం 20వ తేదీ వరకైనా ఇవ్వాలని మాజీ ఎంపీపీ బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు.సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం లో విలేఖరులతో మాట్లాడుతూ ఎంతో ఆశతో ప్రభుత్వం కాల్వల ద్వారా నిళ్లు ఇస్తదని ఆశపడి వరి పంట నాట్లు వేస్తే నిండు పొట్టల మీద ఎండిపోతుందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సీతయ్య అన్నారు.రైతాంగం యొక్క పంటలు కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. నోటికాడికి వచ్చిన పంట పొలం చేతికి రాకుండా నేర్రెలు బాసి ఎండిపోతోందని అన్నారు.ఎండి పోయిన పొలాలను చూసి రైతులు బేంబేలు ఎత్తుతున్నారని అన్నారు.ఇప్పటి కైనా స్థానిక శాసనసభ్యుడు ప్రభుత్వం తో మాట్లాడి ఏప్రిల్ నెలాఖరు వరకు నీళ్ళుచ్చే విధంగా చరియలు చేపట్టాలని అన్నారు.ప్రభుత్వం ఇప్పటికైనా నీళ్లు ఇస్తే ఎండిపోయింది పోను మిగిలిన సగం పంట అయిన చేతికొచ్చే అవకాశం ఉంటదని అన్నారు.లేనిచో ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి తిరుగుబాటుతప్పదని హెచ్చరిక చేశారు.ఈ సమావేశం లో కడారి దేవదాసు. కొండగడుపుల వెంకటేష్ పాల్గొన్నారు.