కోరుట్ల/ మెట్ పల్లి, ముద్ర; బస్సు ద్విచక్ర వాహనం ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందిన ఘటన మెట్ పల్లి మండలంలో చోటు చేసుకొంది.పోలీసుల నడించిన సమాచారం ప్రకారం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం యకిన్ పూర్ గ్రామానికి చెందిన జౌడి నర్సారెడ్డి 68 అతని భార్యతో కలిసి ఓ శుభకార్యానికి వెళుతుండగా వేంపేట గ్రామ మూల మలుపు వద్ద ఎదురుగా వస్తున్న మెట్ పల్లి డిపో కు చెందిన ఆర్టీసి బస్సు ఢీ కొట్టడంతో నర్సారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.ఆయన భార్య తీవ్ర గాయాల పాలు కాగా ఆమెను అంబులెన్స్ లో హుటా హుటీన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నర్సారెడ్డి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక మెట్పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.