తెలివితేటలు, క్రమశిక్షణ వంటి పదాలు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది జపాన్ దేశమే. వీరి ఇంటిలిజెన్స్ ను ఉపయోగించి చేసే తయారు చేసే టెక్నాలజీకి ప్రపంచవ్యాప్తంగా పేరుంది. అయితే, వీరు ఏ విషయాన్నైనా మర్చిపోకుండా ఎలా గుర్తుపెట్టుకుంటారు అనేది అంతుచిక్కని విషయం.
పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదన్నట్టు మనం ప్రతిదానికీ కొత్తరకమైన విధానాన్ని వెదుక్కుంటున్నాం కానీ నిజానికి ఇవన్నీ మన దేశంలో వేదకాలం నుంచి అనుసరిస్తున్నవే. అందుకే వేదమంత్రాలలో తప్పులు దొర్లవు సాధారణంగా ఎంతో పెద్దగా ఉండే విష్ణు సహస్రనామాలు, లలితా సహస్ర నామాలు వంటి వాటిని మన వాళ్లు సులువుగా ధారణ చేసినట్టే వారికి కూడా కొన్ని పద్ధతులున్నాయి.
నేటి రోజుల్లో చాలా మందికి ఏం చేయాలో సరిగా గుర్తుండడం లేదు. చేద్దాం చేద్దాం అని అనుకుంటూనే చేయాల్సిన పనులు మర్చిపోతుంటారు. ఇది చాలా మామూలు విషయమే అయినా..అలాగే ఉంటే కొద్దికాలానికి అంటే వృద్ధాప్యం రాకమునుపే మెదడు మొద్దుబారిపోతుంది. అలాకాకుండా మెదడును చురుగ్గా ఉంచాలంటే కొన్ని ప్రత్యేక పద్ధతులు పాటించాలి.మన జ్ఞాపక శక్తి బలపడాలన్న, వృద్ధాప్యం మీద పడినా మతిమరుపు లేకుండా ఉండాలన్న జపాన్ దేశం శతాబ్దాలుగా పాటిస్తున్న ఈ చిట్కాలను అనుసరించవచ్చు. ఈ చిట్కాలు కచ్చితంగా మీ మెదడును చురుగ్గా ఉంచి, మీరు మర్చిపోతున్న విషయాలను గుర్తుపెట్టుకునేలా చేస్తాయి. ప్రయత్నిస్తే మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.వారు అనుసరిస్తున్న చిట్కాలు ఏంటో చూద్దాం.
💥 శిసా కాన్క:
శిసా కాన్కో అంటే ఒక విషయాన్ని చూపిస్తూ బిగ్గరగా మాట్లాడటం అంటే శరీరానికి, మెదడుకు ఏకకాలంలో పని చెప్పడం లేదా మాటలు చెప్పడం.దీనివల్ల మన దృష్టి పూర్తి స్థాయిలో విషయంపైనే ఉంటుంది. జపాన్ లో రైలు నడిపే ఆపరేటర్లు (మనదేశంలో అయితే ఇంజిన్ డ్రైవర్లు) ఈ విధానాన్ని ఎక్కువగా అనుసరిస్తుంటారు.
💥 కొటోడమా:
జవనీయులు విశ్వసించే మరో శక్తిమంతమైన టెక్నిక్ కొటోడమా.ఇది ఒక పదం లేదా వాక్యాన్ని పదేపదే వునరావృతం చేయడం.దీనివల్ల ఆ పదం మన మెదడులో నిలిచిపోతుంది. విద్యార్థులు లేదా ప్రసంగం ఇచ్చే వ్యక్తులు ఈ పద్ధతి వాడితే వారి జ్ఞాపకశక్తి బలపడుతుంది.
💥 కన్ సాట్సూ:
ఈ పద్ధతిని జపాన్ లో సన్యాసులు,కళాకారులు ఎక్కువగా పాటిస్తారు. కన్ సాట్సూ అంటే చుట్టూ ఉన్న విషయాలను నిశ్శబ్దంగా గమనించడం.మనం ఏమీ మాట్లాడకుండా చుట్టుపక్కల ఉన్న ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తే మెదడు సానుకూలంగా స్పందిస్తుంది. అన్ని విషయాలను శ్రద్ధగా గుర్తుంచుకుంటుంది.కళలతో సంబంధం ఉన్న వ్యక్తులలో ఎక్కువగా కనిపించే ఇది ఒక రకమైన మైండ్ ఫుల్ నెస్ టెక్నిక్.
💥 ఉకెటమో:
ఉకెటమో అనే ఈ భావన టోహౌకు అనే జపనీస్ మతపరమైన వర్గం నుండి వచ్చింది.దీని అర్థం నిజాయితీగా అంగీకరిస్తాను. మనం ఏ అంశాన్నైనా హృదయపూర్వకంగా అంగీకరిస్తే మానసికంగా స్థిరంగా ఉండగలమని అప్పుడు మన భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయని ఇది తెలుస్తోంది.
💥 నైకాన్:
కాలం గడిచే కొద్దీ మన జ్ఞాపకశక్తి తగ్గిపోతుందని అనుకుంటాం. అయితే జపనీయులు నైకాన్ అనే విధానాన్ని పాటిస్తూ.. మౌనంగా ఉండటం ద్వారా పాత జ్ఞాపకాలను తిరిగి గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. ప్రశాంత వాతావరణంలో కూర్చొని నేను ఎవరికి ఏం ఇచ్చాను.. ఎవరి నుంచి ఏం తీసుకున్నాను..? ఎవరి పల్ల నాకు ఇబ్బంది కలిగింది..? వంటి ప్రశ్నలను మనలో మనం వేసుకుంటే పాత జ్ఞాపకాలు తిరిగి గుర్తొస్తాయని వారు చెబుతున్నారు.
💥 గ్యో:
గ్యో అంటే ఒకే పనిలో పూర్తిగా ఏకాగ్రతతో నిమగ్నంకావడం ఉదాహరణకు బల్ల శుభ్రం వేయడం,వస్తువులను క్రమబద్ధంగా సర్దడం లాంటి సాధారణ పసులే అయినా… అని మన మనసును స్థిరంగా ఉంచుతాయి.దీని వల్ల మన మెదడు దృఢంగా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి బలోపేతం అవుతుంది.
💥 చిసోకు:
చిసోకు అనే ఈ పద్దతిలో మనం నిరంతరం లక్ష్యాల వైపు పరుగులు పెట్టడం వల్ల వర్తమానాన్ని మర్చిపోతున్నామని చెబతారు. మనకు ఉన్నది ఈ క్షణమే. దానిపైనే పూర్తిగా దృష్టి పెడితే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. అంటే భవిష్యత్ గురించి ఆందోళన చెందకుండా ప్రస్తుతం ఉన్న పనిపై దృష్టి పెట్టాలి.ఇది మన మానసిక స్థితిని ప్రశాంతంగా ఉంచుతుంది.
* సుధాకర్.ఏ.వి
* రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు
* స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (STUTS)
* 9000674747