Take a fresh look at your lifestyle.

మిస్ వరల్డ్ గా థాయ్‌లాండ్ సుందరి ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ

  • 72వ మిస్ వరల్డ్ గా థాయ్‌లాండ్ సుందరి ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ.
  • ఫస్ట్ రన్నరప్‌గా మిస్ ఇథియోపియా, సెకెండ్ రన్నరప్‌గా మిస్ పోలాండ్.
  • థర్డ్ రన్నరప్‌గా మిస్ మార్టినిక్ నిలిచారు.
  • మిస్ వరల్డ్ విజేతకు వజ్రాల బ్లూ క్రౌన్, రూ. 8.5 కోట్లు నగదు బహుమతి.
  • ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్, భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి, పొన్నం.
  • నటులు చిరంజీవి, నాగార్జున తదితరలు.

ముద్ర, తెలంగాణ బ్యూరో : మిస్ వరల్డ్ 2025 కిరిటాన్ని థాయ్‌లాండ్ సుందరి ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ కైవసం చేసుకున్నారు. 108 దేశాలకు చెందిన సుందరీమణలు పోటీపడిన ఈ పోటీల్లో ఓపల్ సుచాత విజేతగా నిలిచారు. 2025 మిస్ వరల్డ్ ఓపల్ సుచాతకు 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా రూ.6.21 కోట్లు విలువైన 1770 వజ్రాలతో పొదిగిన బ్లూ క్రౌన్‌తో సహా రూ.8.5 కోట్లు నగదు బహుమతి అందజేశారు. మిస్ వరల్డ్ ఫైనల్స్ లో ఆఫ్రికా ఖండం నుంచి ఇథియోపియా, ఆసియా ఖండం నుంచి థాయ్‌లాండ్, యూరోప్ ఖండం నుంచి పోలాండ్, అమెరికా ఖండం నుంచి మార్టినిక్ నిలవగా థాయ్‌లాండ్ సుందరి ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ విశ్వసుందరి కిరిటాన్ని గెలుచుకున్నారు. ఓపల్ సుచాత థాయ్‌లాండ్ లోని పుకెట్‌లో జన్మించారు. మొదటి మిస్ రన్నరప్ గా మిస్ ఇథియోపియా, రెండవ రన్నరప్‌గా మిస్ పోలాండ్, మూడవ రన్నరప్‌గా మిస్ మార్టినిక్ నిలిచారు. ఫైనల్‌కు వచ్చిన నలుగురిలో తుది ప్రశ్న ద్వారా న్యాయనిర్ణేతలు మిస్ వరల్డ్ విజేతను ప్రకటించారు. హైదరాబాద్ మహానగరం వేదికగా ఇరవై రోజులుగా అలరించిన మిస్ వరల్డ్ 2025 ఫైనల్ పోటీలు శనివారం హైటెక్స్ వేదికగా అంగరంగ వైభవంగా జరిగాయి. రాష్ట్ర టూరిజం శాఖ ఆధ్వర్యంలో భారీగా జరిగిన ఈ గ్రాండ్ ఫినాలేలో సుమారు 3500 మంది గెస్టులు, బాలీవుడ్, టాలీవుడ్ నటులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కుటుంబ సభ్యులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి పొన్నం ప్రభాకర్, నటుడు చిరంజీ ఆయన సతీమణి సురేఖ, నాగార్జున తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రత్యేక అతిథిగా 2017 మిస్ వరల్డ్ మానుషీ చిల్లార్, మిస్ వరల్డ్ పోటీల నిర్వహకులు జూలిమా మోర్లీ పాల్గొన్నారు. నాటు నాటు పాటకు బాలీవుడ్ స్టార్ ఇషాన్ కట్టర్ స్టెప్పులు వేస్తూ అలరించారు.

  • టాప్ 8 నుంచి మిస్ ఇండియా నందిని గుప్త ఎలిమినేట్.

టాప్ 8 నుంచి మిస్ ఇండియా నందిని గుప్త ఎలిమినేట్ అయ్యారు. దీంతో భారత అభిమానులకు కొంత నిరాశ కలిగింది. టాప్ 8లో మార్టినిక్, బ్రెజిల్, ఇథియోపియా, నమీబియా, పోలెండ్, ఉక్రెయిన్, పిలిప్పీన్స్, థాయిలాండ్ నిలిచాయి. ఖండాల వారీగా టాప్ ఇద్దరి నుంచి ఒక్కరిని షార్ట్ లిస్ట్ చేశారు. నువ్వ మిస్ వరల్డ్ అయితే ఏం చేస్తావు అని అడిగిన ప్రశ్నకు 45 సెకన్లలో మెరుగైన సమాధానం ఇచ్చిన వారికి నిర్వహకులు అవకాశమిచ్చి, కంటెస్టెంట్ల సమాధానాలకు జడ్జిలు మార్కులు వేశారు.

  • నటుడు సోనూ సూద్‌కు మానవతావాది అవార్డు.

ప్రముఖ నటుడు సోనూ సూద్ మిస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ (మానవతావాది) అవార్డు అందుకున్నారు.కోవిద్ సమయంలో ఆయన చేసిన మానవతాచర్యలకు గుర్తింపుగా ఈ అవార్డును మిస్ వరల్డ్ నిర్వహకలు అందజేశారు. సీనియర్ నటుడు రానా దగ్గుబాటి చేతుల మీదుగా జ్ఞాపిక అందజేశారు. కాగా మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్‌గా వ్యవహరించిన సుధారెడ్డికి జ్ఞాపికను మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లీ అందజేశారు.

  • జడ్జిలుగా వ్యవహరించింది వీరే.

మిస్ వరల్డ్ 2025 పోటీలకు న్యాయనిర్ణీతలుగా జూలియా మోర్లీ, నటుడు సోనూ సూద్, సుధారెడ్డి, నటుడు రానా దగ్గుబాటి, టూరిజం శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్, 2017 మిస్ వరల్డ్ మనూషి చిల్లర్, నమ్రత శిరోద్కర్, డోనా వల్ష్, కరినా టర్రెల్ వ్యవహరించారు.

Leave A Reply

Your email address will not be published.