Take a fresh look at your lifestyle.

నాలాల్లో వరద నీరు సాఫీగా సాగాలి

  • నాలాల కబ్జాలపై ప్రజావాణిలో ఫిర్యాదులకు ఆహ్వానం.
  • హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.

ముద్ర, తెలంగాణ బ్యూరో : వర్షాకాలం ముందుగానే ప్రారంభమైన నేపథ్యంలో నాలాల్లో వరద నీరు సాఫీగా సాగేలా చూడాలని అధికారులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశించించారు. ఈ శనివారం హైడ్రా కార్యాలయంలో ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, మున్సిపల్ శాఖలతో పాటు నాలాల నిర్వహణకు సంబంధించిన అధికారులతో రంగనాథ్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ.. వ‌ర్షాకాలంలో లోత‌ట్టు ప్రాంతాలు, ర‌హ‌దారులు మునిగిపోకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసిన విష‌యాన్ని క‌మిష‌న‌ర్ గుర్తు చేశారు.ఈ క్ర‌మంలో అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండి స‌మ‌స్య ప‌రిష్క‌రానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు.నాలాల ఆక్రమణలు, ఇబ్బందులపై ప్రజావాణిలో ఫిర్యాదులను స్వీకరించాలని ఆయన సూచించారు. ఓఆర్ఆర్ పరిధిలో నాలాల కబ్జాలకు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. నాలా ఆక్రమణకు గురైనట్లుగా రుజువు చేసే చిత్రాలు, పాతవి , ప్రస్తుతానివి కూడా తీసుకొచ్చి ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే ఉపయుక్తంగా ఉంటుందని ఆయన తెలిపారు. క్షేత్ర స్థాయిలో మీకేమైనా ఇబ్బందులుంటే నేరుగా స‌మాచారం ఇస్తే తాము చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అన్నారు. ప్రాంతాల‌వారీ నాలాల స‌మ‌స్య‌ల‌ను గుర్తించాలని, మీరంతా స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న‌తో ఉంటే.. స‌మ‌స్య ప‌రిష్కారానికి త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అన్నారు.చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌తో పాటు నాలాల ప‌రిర‌క్ష‌ణకు ప్ర‌భుత్వం చాలా ప్రాధాన్య‌త‌నిస్తోంద‌ని తెలిపారు.ఆ క్ర‌మంలోనే క‌బ్జాల నివార‌ణ‌పై హైడ్రా దృష్టి పెట్టింద‌ని ఆయన చెప్పారు. నాలాలు కుంచించుకుపోవ‌డం, మ‌ధ్య‌లో ఆటంకాలు ఏర్ప‌డినా, ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డినా ఆ వివ‌రాలివ్వాల‌ని కోరారు. ఇందుకు సంబంధించిన నివేదిక రూపొందించాల‌ని అధికారులకు ఆయన సూచించారు. క‌ల్వ‌ర్టుల వ‌ద్ద చెత్త పేరుకుపోతోందని, ఆ చెత్త‌ను తొల‌గించ‌డంలో నిర్ల‌క్ష్య‌మే వ‌ర‌ద ముప్పున‌కు ప్ర‌ధాన కార‌ణంగా ఉంద‌ని రంగ‌నాథ్ పేర్కొన్నారు. మ‌ల‌క్‌పేట వ‌ద్ద మ్యాన్‌హోళ్ళ నుంచి వ‌ర‌ద పోటెత్త‌డానికి ఇదే కార‌ణ‌మ‌న్నారు. చెత్త తొల‌గించే ప‌నులు సాఫీగా సాగుతున్నాయా లేదా అనేది ప‌ర్య‌వేక్షించాల‌ని సూచించారు. నాలాల్లో చెత్త, నిర్మాణ వ్య‌ర్థాలు వేసిన వారిపైన‌ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలన్నారు. స‌మాచారం ఇస్తే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామని తెలిపారు.హైడ్రా పోలీసు స్టేష‌న్‌లో వారిపై కేసులు పెట్టి విచారిస్తామ‌న్నారు. ఈ ఏడాది న‌గ‌రానికి వ‌ర‌ద ముప్పు లేకుండా అంద‌రూ స‌మ‌న్వ‌యంతో క‌లిసి ప‌ని చేయాల‌ని రంగనాథ్ సూచించారు.

Leave A Reply

Your email address will not be published.