Take a fresh look at your lifestyle.

నాగర్ కర్నూల్‌లో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో భారత రాజ్యాంగ శిల్పి డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొని అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రూపుదిద్దిన మహనీయుడని, సమానత్వం మరియు సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

అనంతరం అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సిబ్బందికి చీరలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, టౌన్ ప్రెసిడెంట్ జక్కా రాజు, స్థానిక కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.