Take a fresh look at your lifestyle.

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

  • స్థానిక ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేతల హర్షం

బీబీనగర్, ముద్ర విలేకరి: బీబీనగర్ పట్టణ కేంద్రంలో పోచంపల్లి చౌరస్తాలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి బీబీనగర్ మండల కాంగ్రెస్ నాయకులు పాలతో అభిషేకం చేశారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని సీఎం ఆధ్వర్యంలోని కేబినెట్ తీర్మానించడం, చట్టసవరణ చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహా, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసనసభ్యుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గోలి పింగళ్ రెడ్డి, పొట్టోళ్ల శ్యామ్ గౌడ్, బాలకృష్ణ గౌడ్ తదితర నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులంతా మిఠాయి పంచుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.