Take a fresh look at your lifestyle.

కేపీహెచ్‌బీలో ‘డీకాయ్’ ఆపరేషన్: ఇద్దరు అంతర్రాష్ట్ర ఫోన్ దొంగల అరెస్ట్

 

ముద్ర కూకట్‌పల్లి : రద్దీగా ఉండే బస్టాప్‌లలో ప్రయాణికులే లక్ష్యంగా సెల్‌ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను కేపీహెచ్‌బీ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. గురువారం జేఎన్టీయూ బస్టాప్ వద్ద నిర్వహించిన ప్రత్యేక ‘డీకాయ్’ ఆపరేషన్‌లో నిందితులు పట్టుబడ్డారు.

నిందితులు ముఖ్యంగా బస్సులు ఎక్కే, దిగే సమయంలో ప్రయాణికుల తొందరపాటును, అజాగ్రత్తను ఆసరాగా చేసుకుని జేబుల్లోని విలువైన ఫోన్లను మాయం చేసేవారు. వీరి నుంచి రూ. 1.50 లక్షల విలువైన నాలుగు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

A1: అవుల నరేంద్ర (24) – విజయనగరం జిల్లాకు చెందిన ఇతడు ప్రస్తుతం మీర్‌పేట్‌లో నివసిస్తున్నాడు.

A2: చింత ప్రభు @ మేఖల రాజు (26) – పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడుకు చెందిన పెయింటర్.

నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా వెనుక ఉన్న ఇతర నెట్‌వర్క్ గురించి దర్యాప్తు కొనసాగుతోంది.

Leave A Reply

Your email address will not be published.