ముద్ర, మోత్కూరు:
దేశంలో సరిపడ చమురు, గ్యాస్ నిల్వలు ఉన్నాయని కొరతలేదని చెప్తూనే గ్యాస్ ధరలు పెంచి పేద ప్రజలపై బారాలు వేయడం సరికాదని పెంచిన గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహారించు కోవాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు ,జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి డిమాండ్ చేశారు. సోమవారం గ్యాస్ ధరల పెంపును నిరశిస్తూ మోత్కూర్ మండలం పాలడుగు గ్రామంలో వలిగొండ తొర్రూర్ ప్రధాన రహదారి పై గ్యాస్ సిలిండర్ లతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గృహ అవసరాల వాణిజ్య సిలిండర్లపై రెండింతల ధరల పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఉజ్వల పథకం లబ్ధిదారులను కూడ వదలి పెట్టకుండా గృహ అవసరాల గ్యాస్ వినియోగదారులపై రూ 60 ల పెంపు క్రూరమైనదని విమర్శించ్చారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ పై రూ 114, 50 పైసలు పెంపుకూడ వినియోగదారులైన ప్రజలపై భారం పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు, మండల కమిటీ సభ్యులు దడిపల్లి ప్రభాకర్, శాఖ కార్యదర్శి పిట్టల చంద్రయ్య, వెండి యాదగిరి, చింతకింది సోమరాజు, దడిపల్లి నవనీత, మాదవి, కొంపల్లి రాజేశ్వరి, దడిపల్లి సైదులు తదితరులు పాల్గొన్నారు.