ముద్ర : మల్కాజిగిరి
హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని తాడుబందు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా మల్కాజ్‌గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి , వారి సతీమణి మర్రి మమత రాజశేఖర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి తో కలిసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు దేశ ప్రజలందరికీ శాంతి, సుఖసంతోషాలు కలగాలని, సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం మరింత బలపడాలని శ్రీ వీరాంజనేయ స్వామివారిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ మాజీ బోర్డు సభ్యులు పాండు, గజ్జెల నాగేష్, నాయకులు టి.ఎన్. శ్రీను, జె.ఏ.సి వెంకన్న, సురేష్ తదితర నాయకులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.