ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న ముగ్గురు అధ్యాపకులు టీజీ సెట్‌లో అర్హత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ మదన్ మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు.
లైఫ్ సైన్స్ విభాగానికి చెందిన బాదం నరేష్, ఇంగ్లీష్ విభాగానికి చెందిన ఎత్తం రమ్య రెడ్డి అలాగే కంప్యూటర్ సైన్స్ విభాగంలో టీఎస్కేసీ మెంటర్‌గా పనిచేస్తున్న రామకృష్ణ టీజీ సెట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు.
ఒకేసారి ముగ్గురు అధ్యాపకులు స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో అర్హత సాధించడంతో కళాశాలలో ఆనందోత్సాహ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా విద్యార్థుల సమక్షంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి, టీజీ సెట్ ఉత్తీర్ణులైన అధ్యాపకుల కృషిని కొనియాడుతూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.
అనంతరం వారిని శాలువా మరియు పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఏఓ మహమ్మద్ ఇర్ఫాన్ అధ్యాపకులు అంజయ్య, వనిత, కోదండరాములు, రామకృష్ణ, దశరథ, ముజఫర్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.