Take a fresh look at your lifestyle.

ప్రజావాణిలో 9 ఫిర్యాదులు స్వీకరణ – జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ప్రజల నుండి 9 ఫిర్యాదులను స్వీకరించారు.

ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల సమస్యలను స్వయంగా విని, వాటిని చట్టప్రకారం త్వరితగతిన పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.

స్వీకరించిన ఫిర్యాదుల్లో భూమికి సంబంధించినవి 2, తగు న్యాయం కోసం 5, కుటుంబ తగాదాలకు సంబంధించినవి 2 ఉన్నాయి. ఈ ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్‌ఐలు, సీఐలతో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యల స్థితిగతులను తెలుసుకొని, పరిష్కారానికి మార్గనిర్దేశం చేశారు.

ప్రజలు ఎలాంటి భయం లేకుండా, మధ్యవర్తుల అవసరం లేకుండా నేరుగా పోలీసులను సంప్రదించి తమ సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలని ఎస్పీ సూచించారు. ప్రజలకు మరింత చేరువగా ఉండుతూ, శాంతి భద్రతలను కాపాడటమే జిల్లా పోలీస్ శాఖ లక్ష్యమని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.