Take a fresh look at your lifestyle.

తెలంగాణ భగత్ సింగ్ దొడ్డి కొమురయ్య…. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్…

దొడ్డి కొమురయ్య ఆశయాలు నేటి యువతకు స్పూర్తి…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు, తొలి అమరుడు దొడ్డి కొమురయ్య కురుమ నేటి యువతకు ఆదర్శప్రాయుడని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని ధర్మపురి రోడ్డు విజయపురిలో గల ఆయన విగ్రహానికి శుక్రవారం పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లో కూడా జయంతి ఉత్సవాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ భగత్ సింగ్ దొడ్డి కొమురయ్య అని, ఆయన స్ఫూర్తితోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, DCC అధ్యక్షులు గాజంగి నందయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, AMC ఛైర్మెన్ గడ్డం నారాయణ రెడ్డి, కమిషనర్ స్పందన, కౌన్సిలర్ లు, నాయకులు బాల ముకుందం, దయాళ మల్లారెడ్డి, పుల్ల మల్లయ్య, కురుమ సంఘం సభ్యులు, పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.