Take a fresh look at your lifestyle.

నలుగురు పీసీలకు పదోన్నతి

ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లాలో నలుగురు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారు. వారిలో నరహరి (హవేలీఘనపూర్), మోహన్ (నార్సింగి), గోవర్ధన్ (మనోహరాబాద్), తాహెర్ అలీ
(మెదక్ టౌన్ ట్రాఫిక్) ఉన్నారు. విధి నిర్వహణలో వారి అంకితభావం, కృషికి గుర్తింపుగానే ఈ పదోన్నతులు లభించాయి.
పోలీసు శాఖలో క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వహించే సిబ్బందికి తగిన గుర్తింపు ఎప్పటికప్పుడు లభిస్తుందని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.