ప్రధానిగా రాహుల్ గాంధీని చేయడమే లక్ష్యం పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలి విలేకరుల సమావేశంలో MLA మేఘారెడ్డి, DCC అధ్యక్షులు శివసేన రెడ్డిలు
ముద్ర, వనపర్తి :
భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీని చేసేంతవరకు విశ్రమించకూడదని, ప్రతి ఒక్కరం సంఘటితంగా పనిచేసి క్షేత్రస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి , జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివసేన రెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఈ నెల 9వ తేదీ నుంచి 16 వ తేదీ వరకు బూత్ స్థాయి కమిటీ, వార్డ్ కమిటీ, గ్రామ కమిటీ, మండల కమిటీ, పట్టణ కమిటీల ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గతంలో మాదిరి కాకుండా ప్రస్తుతం బూతు అధ్యక్షుడిని కూడా నియమిస్తుందన్నారు. ఓటు హక్కు ఉన్న బూతులోనే అక్కడి నాయకుడు బూతు అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడని, వీటితోపాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విభాగాలను సైతం ఏర్పాటు చేస్తారని తెలిపారు.
అలాగే NSUI సంఘాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు. కాంగ్రెస్ మహిళా విభాగం కూడా ఎన్నుకో బడుతుందని ఎవరైతే ఉత్సాహంగా పని చేసేందుకు ముందుకు వచ్చిన మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని వారు తెలిపారు. క్షేత్రస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పూర్తి సంసిద్ధంగా ఉందని పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు పార్టీ బలోపేతానికి చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం లభిస్తుందని ఎవరు కూడా నిరాశ చెందకుండా పార్టీ కోసం పని చేయాలని వారు సూచించారు. ఈ సమావేశంలో వనపర్తి మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమోదిని రెడ్డి, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.