ముద్ర, జగిత్యాల టౌన్: రిజర్వేషన్ అభ్యర్థులు లేక ఖాళీగా ఉన్న ఉర్దూ మీడియం ఉపాధ్యాయ పోస్టులను క్యారీ ఫార్వర్డ్ చేయకుండా వెంటనే భర్తీ చేయాలని పిఆర్టియు టీఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు బోయినపల్లి ఆనంద్ రావు అన్నారు. పొలస ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న మహమ్మద్ జూల్ పికర్ అలీ పదవి విరమణ సందర్భంగా సోమవారం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టులు మంజూరు చేయాలని వారు కోరారు. అనంతరం మహమ్మద్ జూల్ఫికార్ అలీని సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్యామ్ సుందర్, అబ్దుల బేగ్, ఆత్మ చరణ్ రావు, తస్లీమా పాషా తదితరులు పాల్గొన్నారు.