- విద్యార్థిని అభినందించిన ప్రిన్సిపాల్ రజిత.
ముద్ర, జగిత్యాల టోన్: సేమ్స్ ఒలంపియాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా పోటీల్లో జగిత్యాలకు చెందిన విద్యార్థి పిట్ట గౌతం కుమార్ సైన్స్ విభాగంలో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా గౌతమ్ కుమార్ ను మానస ఎక్సలెన్స్ ప్రిన్సిపల్ బోయినపల్లి రజిత సోమవారం అభినందించారు. మానస ఎక్స్లెన్స్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్ సాధించడంతో హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఫౌండేషన్ నిర్వాహకుల చేతుల మీదుగా విద్యార్థిని మెమొంటోతో పాటు, గోల్డ్ మెడల్ అందించి శాలువాతో సత్కరించి అభినందించారు. కాగా విద్యార్థి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం పట్ల జగిత్యాల అర్బన్ మండలంలోని మోతే గ్రామానికి చెందిన తాజా, మాజీ ప్రజాప్రతినిధులతో పాటు ఆయా కుల సంఘాల నాయకులు విద్యార్థి గౌతమ్ కుమార్ ను అభినందించారు.