Take a fresh look at your lifestyle.

హెచ్.సి.యు విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జి అమానవీయం

  • వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్

వికారాబాద్, ముద్ర : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసుల లాఠీ జార్జి అమానవీయమని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మెతుకు అన్నారు.వికారాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రభుత్వ భూములను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేయొద్దని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న హెచ్.సి.యూ విద్యార్థులు, ప్రొఫెసర్లను ప్రభుత్వం అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని అన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై లాటిచార్జి చేయడం అత్యంత హేయమైన చర్య. అని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి , ప్రభుత్వ భూములను అమ్మ వద్దని చిలుక పలుకులు పలికి, ఇప్పుడు 400 ఎకరాల ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేయడానికి పూనుకోవటం దుర్మార్గమని అన్నారు.కెసిఆర్ హయాంలో గ్రీన్ కవరేజ్ పెరిగి, ప్రపంచంలోనే హైదరాబాద్ పట్టణం గ్రీన్ సిటీగా గుర్తింపు పొందిందిని అన్నారు.కెసిఆర్ ప్రభుత్వంలో 9 ఏళ్ల పాటు హరితహారం జరిగితే, ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి ఆ పథకం హరిత సంహారం జరుగుతుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, గ్రీన్ కవరేజ్ తగ్గడంతో పాటు భూగర్భ జలాలు తగ్గడం చూస్తూ ఉంటే భావితరాలకు సహజ సంపదను దూరం చేయడమే అనిపిస్తుందని అన్నారు.కొన్ని దేశాలలో కలుషితమైన వాతావరణంతో ఇప్పటికే ఆక్సిజన్ క్లబ్బులు ఏర్పడటం మనం గుర్తుపెట్టు కోవాల్సిన అవసరం ఉందన్నారు.అటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో రాకుండా ముందు జాగ్రత్త చర్యలుతీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.ఆడ రాక పాత గజ్జలు అన్నట్లు పరిపాలన చేతగాక, చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కారు, ఈ విధమైన చర్యలు చేయడం దారుణం అని అన్నారు.మన హైదరాబాద్ పట్టణము మోస్ట్ లివబుల్ సిటీ గా గుర్తింపు పొందిందని, దాన్ని అలాగే కొనసాగించే బాధ్యత మనందరి పైన ఉందని అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టడం అనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.