Take a fresh look at your lifestyle.

గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలు -డీఈఓ దర్శనం భోజన్న

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలని డీఈఓ దర్శనం భోజన్న అన్నారు.
‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్మల్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ‘విద్యా వారోత్సవాలు’ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డీఈఓ దర్శనం భోజన్న, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్ ఆలీ, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. డీఈఓ భోజన్న మాట్లాడుతూ దేవాలయం, విద్యాలయం, గ్రంథాలయం ఆలయాల వంటివని, పవిత్ర స్థలాలని, జ్ఞాన కేంద్రాలని కొనియాడారు. గ్రంథాలయం ఉపయోగించుకొన్న ప్రతీ వ్యక్తి అభివృద్ధి లో ఉంటారని, ఉన్నత స్థానంలో జీవిస్తారన్నారు. జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది వేల పుస్తకాలు విరాళంగా అందించారని, వాటిని పాఠశాలల గ్రంథాలయాలకు అందిస్తామన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్ అలీ మాట్లాడుతూ ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక లక్ష్యం ప్రతి పౌరుడిని విద్యావంతుడిని చేయడమేనన్నారు. మే 15న గ్రంథాలయ మహోత్సవం’ నిర్వహించి విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచుతామని తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారిణి కొత్తపల్లి విజయలక్ష్మి తమ శాఖ పక్షాన 336 పుస్తకాలు జిల్లా విద్యాశాఖ కు అందజేశారు.

Leave A Reply

Your email address will not be published.