బోథ్, ముద్ర:
ఆదిలాబాద్ జిల్లా బోథ్ లో బస్ డిపోను ఏర్పాటు చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను కోరారు.
శనివారం అసెంబ్లీ హాలులో ఆర్టీసీ సమస్యలపై నిర్వహించిన సమావేశానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ బోథ్ మండల కేంద్రంలో ఆర్టీసీ డిపోను ఏర్పాటు చేయాలని, బోథ్ నియోజకవర్గంలోని అన్ని గిరిజన గ్రామాలకు ఆర్టీసీ సేవలు కనెక్టివిటీ చేయాలని కోరారు. ఇచ్చోడ మండల కేంద్రంలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికుల సౌకర్యార్తం సీసీ రోడ్లు, మరుగుదొడ్లు, రెస్ట్ రూంలు, త్రాగు మరియు మంచి నీటి సౌకర్యాలు కల్పించాలని కోరుతూ వినతి పత్రంను అందజేశారు. నియోజకవర్గంలో మేజర్ రిమోట్, కనెక్టివిటీ గ్రామాల్లో బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని కోరారు.