ముద్ర : కాప్రా
ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పేరు విషయంలో వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం తీవ్ర మవుతోంది , ప్రభాకర్ బండారి రాజిరెడ్డి పేరు పెట్టడాన్ని వ్యతిరేకించడం ఏమాత్రం సమంజసం కాదని బండారి లక్ష్మారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. శుక్రవారం కాప్రాలో ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ
“ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన బండారి రాజిరెడ్డి. ఉప్పల్ నియోజకవర్గం మొదటి ఎమ్మెల్యే గా
మున్సిపల్ చైర్మన్‌గా, టీటీడీ బోర్డు సభ్యుడిగా అన్ని పదవులలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అలాంటి వ్యక్తి సేవలకు గుర్తింపుగా ఎలివేటెడ్ కారిడార్‌కు ఆయన పేరు పెట్టడం గర్వకారణం” “అని స్పష్టం చేసారు , ప్రభాకర్ వాజపేయి పేరు పెట్టాలని మాట్లాడటం సిగ్గుచేటు. జాతీయ నాయకుల పేర్లు జాతీయ రహదారులకు సరిపోతాయి. మాకు బిజెపి పై ద్వేషము లేదు దేశానికి సేవ చేసిన అటల్ బిహారి వాజ్పేయి పట్ల అపారమైన గౌరవం ఉంది అలాంటి మహా నేత పేరు పెట్టాలంటే జాతీయ రహదారుల కు పెట్టవచ్చన్నారు. స్థానిక అభివృద్ధికి కృషి చేసిన నాయకుల పేర్లను గుర్తించడం తప్పా?” అంటూ ప్రశ్నించారు.
“అర్థం లేని వ్యాఖ్యలు చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎవరు అభివృద్ధి కోసం పనిచేస్తున్నారో, ఎవరు రాజకీయ లాభాల కోసం మాట్లాడుతున్నారో వారికి బాగా తెలుసు” అంటూ తీవ్ర పదజాలంతో దాడి చేశారు. నేనెప్పుడూ అక్రమాలకు పాల్పడలేదు నీలాగా పార్కులు కబ్జాకు ప్రోత్సహించలేదు అంటూ మాజీ బీజేపీ ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ పై ఘాటు విమర్శలు చేశారు.
ఈ వ్యాఖ్యలతో ఉప్పల్ రాజకీయాలు మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి. స్థానిక నాయకుల మధ్య మాటల యుద్ధం ఎటు దారితీస్తుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.