ఎస్ జి టి యు ఉపాధ్యాయులు ప్రీమియర్ లీగ్ సీజన్-1 క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన గద్వాల ఎమ్మెల్యే
ముద్ర, గద్వాల:
ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కోసం ఉపాధ్యాయులు క్రీడా స్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరముందని, ఉపాధ్యాయ సంఘాలు క్రీడా స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో వివిధ ప్రాంతాలలో క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు.

ఆదివారం జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియం లో ఎస్ జీ టియు ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రీమియర్ లీగ్ సీజన్ -1 క్రికెట్ టోర్నమెంట్ ను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే మ మాట్లాడుతూ….
ఉపాధ్యాయులు కేవలం బోధనకే పరిమితం కాకుండా, విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహిస్తూ, స్వయంగా క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించాలన్నారు. క్రీడలు ఉపాధ్యాయులు, విద్యార్థులలో మానసిక ఉల్లాసాన్ని, శారీరక దారుఢ్యాన్ని పెంచుతాయన్నారు.

ఉపాధ్యాయులు క్రీడలలో చురుకుగా పాల్గొన్నప్పుడు, పాఠశాలల్లో “కలెక్టివ్ ఎఫెర్వెసెన్స్ ఏర్పడుతుంది అని ఇది విద్యార్థుల విజయానికి బాటలు వేస్తుంది అన్నారు.
ఉపాధ్యాయులు పాఠశాలలో తరగతి గదిలలో విద్యార్థులకు విద్యను బోధించుతోపాటు అప్పుడప్పుడు మానసిక ఉల్లాసం కోసం ఉపాధ్యాయులు కూడా క్రీడలల్లో పాల్గొన్నాలని సూచించారు. మారుతున్న సమాజంలో పెరుగుతున్న పోటీతత్వంతో కార్పొరేటర్ పాఠశాలలతో దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధన అందించేందుకు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, ఇలాంటి సందర్భంలో ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా క్రీడలతో మానసిక ఉల్లాషాన్ని పొందుతారని తెలిపారు.
రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా గద్వాల జిల్లా లోని ఉపాధ్యాయులు క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని వీరిని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కూడా ఉపాధ్యాయ సంఘాలు క్రీడా టోర్నమెంట్లు నిర్వహించాలన్నారు. ఉపాధ్యాయులకు క్రీడాపోటీలు నిర్వహించడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందని, ఉపాధ్యాయుల మధ్య ఐక్యత స్నేహభావం పెంపొందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గద్వాల మున్సిపల్ చైర్ పర్సన్ తుమ్మల జయలక్ష్మి నర్సింహులు యాదవ్, మాజీ కౌన్సిలర్ నరహరి శ్రీనివాసులు, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ ఆంజనేయులు,నాయకులు ముత్యాల రవి, నాయకులు కార్యకర్తలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.