ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ డిఎస్పి గా భైంసా ఎస్డీపీఓ సాయికిరణ్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు పి. సాయి కిరణ్ బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ డీఎస్పీగా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యూనివర్సిటీ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, విద్యార్థులు, సిబ్బందికి భద్రత కల్పించడం, అలాగే యూనివర్సిటీ పరిపాలనతో సమన్వయం చేసుకుంటూ విధులను సమర్థవంతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ యాజమాన్యం, విద్యార్థులు, సిబ్బంది పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు.