- ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి.
- ఎసిపి సిహెచ్ శ్రీనివాస్.
ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: రామగుండం కమిషనరేట్ పరిధి లో గోదావరిఖని మునిసిపల్ టీ జంక్షన్ వద్ద గురువారం రామగుండం ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.స్పెషల్ డ్రైవ్ లో రామగుండం ట్రాఫిక్ ఏసిపి సిహెచ్ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ నెంబర్ ప్లేట్లు,వాహనం కి సౌండ్ పొల్యూషన్,ఫోర్ వీలర్ వెహికల్స్ సీట్ బెల్ట్ పెట్టుకోవడం, వాహనాని కి సంబంధించిన పత్రములు అన్ని ఉండాలని తెలిపారు.వాహనాలు స్పీడ్ గా డ్రైవ్ చేయడం నెంబర్ లేకుండా వాహనం నడపరాదని అన్నారు.టు వీలర్ వాహనాలు శబ్ద కాలుష్యానికి సంబంధించిన సైలెన్సర్లతో రామగుండం ట్రాఫిక్ పోలీస్ వారు ఒక స్టాపర్ను తయారు చేయడం పట్టణంలో శబ్దం చేసుకుంటూ వాహనం నడపరాదని మైనర్లకు వాహనం ఇవ్వరాదని తెలిపారు.ఈ కార్యక్రమంలో రామగుండం ట్రాఫిక్ సిఐ బి.రాజేశ్వరరావు, పెద్దపెల్లి ట్రాఫిక్ సిఐ అనిల్, మంచిర్యాల్ ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ,ఎస్సైలు హరి శేఖర్,ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.