- మున్సిపల్ కమిషనర్ రవీందర్.
కోరుట్ల, ముద్ర విలేకరి: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా గురువారం రోజు కోరుట్ల పురపాలక సంఘంలో కమిషనర్ రవీందర్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ వర్షాకాల దృష్ట్యా పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రజలకి తడి చెత్త, పొడి చెత్త హానికరమైన చెత్త గురించి అవగాహన కల్పించాలని, హోమ్ కంపోస్టింగ్, 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ వాడకం నిషేధం పై వార్డు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.వర్షపు నీరు ఆగిన గుంతలను గుర్తించి భవన నిర్మాణాల నుంచి వచ్చే వ్యర్ధాలతో పూడ్చాలని తెలిపారు.పట్టణంలోని పలు వార్డుల్లో పారిశుద్ధ్య పనులను కమిషనర్ పరిశీలించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, ఏఈ అరుణ్ కుమార్, లక్ష్మీ, టౌన్ ప్లానింగ్ సర్వేయర్ రమ్య, ఆర్ఐ క్రాంతి, సానిటరీ ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్, వార్డ్ ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
