కోరుట్ల, ముద్ర విలేకరి: రెండవ షిర్డీగా పేరొందిన కోరుట్ల పట్టణంలోని శ్రీ సాయిరామ దేవాలయంలో 3 వ తేదీ నుండి 10 వ తేదీ వరకు శ్రీ సాయి సచ్చరిత్ర సప్తాహ పారాయణ మహా యజ్ఞ కార్యక్రమము ను మహా మంటపంలో నిర్వహిస్తున్నట్లు దేవాలయ కార్య నిర్వహణ అధికారి కే. కాంతారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మొదటి రోజున మండపారాధన, కలశ స్థాపన, హోమ కార్యక్రమంను అర్చకులు రమేష్ శర్మ, వినయ్ శర్మ లు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులచే పారాయణ కార్యక్రమమును ప్రారంభించారు. అనంతరం వనమహోత్సవంలో భాగంగా ప్రభుత్వ ఆదేశానుసారం, దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల ప్రకారము దేవాలయ ఆవరణలో చెట్లు నాటారు. కార్యక్రమంలో దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ బాలే ప్రసాద్, కమిటీ సభ్యులు, భక్తులు, అర్చక సిబ్బంది పాల్గొన్నారు.
