- ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి.
ముద్ర ప్రతినిధి, కల్వకుర్తి: గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.గురువారం క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతొ సమావేశం నిర్వహించారు.శుక్రవారం హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గ్రామస్థాయి నాయకులతో సమావేశం కానున్నారు.నియోజకవర్గంలోని ప్రతి గ్రామ అధ్యక్షుడు సమావేశంలో పాల్గొనాలని ఎమ్మెల్యే సూచించారు.సమ్మేళనంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి తదితర అంశాలపై మల్లికార్జున ఖర్గే దిశ నిర్దేశం చేయనున్నారని ప్రతి ఒక్కరు విధిగా హాజరై పార్టీ అభివృద్ధికి తమ వంతుగా కృషి చేయాలని కోరారు.గ్రామస్థాయి నుండి అన్ని కమిటీల అధ్యక్షులు సమావేశంలో పాల్గొనాలని అందుకుగాను తగిన ఏర్పాట్లు చేయాలని నాయకులకు సూచించారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన పలువురికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పొల్యూషన్ బోర్డ్ సభ్యుడు బాలాసింగ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, భూపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రమాకాంత్, వివిధ మండలాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.