Take a fresh look at your lifestyle.

పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాముకాటు కలకలం

  • 8వ తరగతి విద్యార్థి నవనీత్ కాలుకు రెండు కాట్లు.
  • హుటాహుటీన కోరుట్ల ఆసుపత్రికి తరలింపు.
  • కాటేసింది పామా, విష పిరుగా?
  • స్పష్టత లేకపోవడంతో అయోమయంలో విద్యార్థులు, పేరెంట్స్.
  • విద్యార్థికి ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేసిన వైద్యులు.

కోరుట్ల, ముద్ర విలేకరి: జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటు కలకలం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకులం లో తాజాగా ఓ విద్యార్థి కాలుకు రెండు కాట్లు ఉండడం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తుంది. రాత్రి డిన్నర్ సమయంలో హ్యాండ్ వాష్ చేసుకునేందుకు వెళ్ళిన 8వ తరగతి విద్యార్థి నవనీత్ ను విష పురుగు కాటు వేసింది. కాలు నుంచి రక్తం కారడంతో వెంటనే టీచర్స్ కు సమాచారం ఇవ్వగా హుటాహుటీన కోరుట్లలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాలుకు రెండు కాట్లు ఉండడంతో పాము కాటు వేసిందా లేక ఏదైనా విషపురుగు కుట్టిందా అనేది స్పష్టత లేదు. ప్రస్తుతం ఆ విద్యార్థి ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. డిన్నర్ సమయంలో హ్యాండ్ వాష్ చేసుకునేందుకు వెళ్లినప్పుడు ఏదో కుట్టినట్లు అనిపించిందని వెంటనే టీచర్స్ సమాచారం ఇచ్చానని విద్యార్థి చెబుతున్నారు. వైద్యులు మాట్లాడుతూ ఏమి కాటు వేసిందో స్పష్టత లేదని గతంలో జరిగిన ఘటనలు దృష్టిలో పెట్టుకొని స్నేక్ బైట్ గా అనుమానిస్తూ చికిత్స అందిస్తున్నామని తెలిపారు.గత ఏడాది పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటుతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా మరో ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురై కోలుకున్నారు. తాజా ఘటనతో విద్యార్థులు పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.