- వీటికి సరిపోయే నిధులు కలెక్టరేట్ ద్వారా మంజూరు చేస్తాం.
- జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్.
వికారాబాద్, ముద్ర ప్రతినిధి: జిల్లాలో ఉండే ప్రతి ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు త్రాగు నీరు, టాయిలెట్స్, లైట్స్, ఫ్యాన్ లు ,పెయిన్టింగ్ తప్పనిసరిగామౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయాలనీ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు ఆదేశించారు.బుధ వారం కలెక్టరేట్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లాలోని ఎం పి డి ఓ లు, కళాశాలల ప్రిన్సిపాల్స్ కు వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో ఉండే ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉండే మేజర్, మైనర్ రిపేర్ పనులపై ద్రుష్టి పెట్టాలని, పనులు ప్రారంభించి పూర్తి చేయాలనీ అన్నారు. ప్రతి కళాశాల లో విద్యార్థులకు అవసరమయ్యే త్రాగునీరు, టాయిలెట్స్, మైనర్ రిపేర్ పనులు, లైట్స్. ఫ్యాన్లు తప్పనిసరిగా పెట్టించాలన్నారు.ప్రతి కళాశాల వారీగా మీరుఇచ్చిన అంచనా ప్రకారం నిధులు మంజూరు చేస్తామన్నారు. పనులపై ద్రుష్టి సారించి ఆగస్టు నెల చివరి నాటికి పూర్తి చేయాలనీ ఆదేశించారు. మేజర్, మైనర్ రిపిర్ పనులకు ముందు తర్వాత ఫోటోలు తప్పనిసరిగా పంపించాలన్నారు.ఈ సందర్బంగా అన్ని మండలాల వారిగా ఏం పి డి ఓ లు మరియు ప్రిన్సిపాల్స్ తో కళాశాలల లో ఉండే సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి , డి ఐ ఓ శంకర్ నాయక్ తదితరలు పాల్గొన్నారు.
