ముద్ర మల్కాజ్గిరి
మల్కాజిగిరి డివిజన్ పరిధిలో రూ. కోటి వ్యయంతో పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ శ్రావణ్ సోమవారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ పార్క్‌లో రూ. 10 లక్షల వ్యయంతో వాలీబాల్ కోర్టు.
భ్రమరాంబికానగర్, విష్ణుపురి ప్రాంతాల్లో రూ. 25 లక్షలతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు ,
అలాగే సర్దార్ పటేల్ నగర్‌లోని హిందూ స్మశాన వాటిక అభివృద్ధికి రూ. 60 లక్షలతో పలు పనులు చేపడుతున్నట్టు తెలిపారు. స్మశాన వాటికను మోడల్ గ్రేవ్‌యార్డ్‌గా అభివృద్ధి చేసేందుకు అదనంగా మరో రూ. కోటి నిధుల ప్రతిపాదనలు పంపాలని అధికారులను కార్పొరేటర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సునీల్ యాదవ్, నందు యాదవ్, మాధవ్, మురళి గౌడ్, జోగు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.