Take a fresh look at your lifestyle.

ఇన్స్యూరెన్స్ చెక్కు అందజేత- జిల్లా ఎస్పి నరసింహ

 

ముద్ర సూర్యపేట జిల్లా ప్రతినిధి

జిల్లా పోలీసు శాఖ నందు పని చేస్తూ అకాలంగ మరణించిన ఏఎస్ఐ సత్యనారాయణ కుటుంభానికి 10 లక్షల రూపాయల సాలరీ ప్యాకేజ్ SBI ఇన్స్యూరెన్స్ చెక్ ను శుక్రవారం జిల్లా ఎస్పి నరసింహ కార్యాలయం నందు అందించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు పోలీసు లకు ప్రత్యేక సాలరీ ప్యాకేజీ ఇవ్వడం జరిగినది. పోలీసు సిబ్బంది మరణించిన క్రమంలో ఈ పోలీస్ సాలరీ ప్యాకేజ్ అకౌంట్ ద్వారా 10 లక్షల రూపాయల ఇన్స్యూరెన్స్ అందిస్తుంది. ఈ స్కీం ద్వారా ఈరోజు సత్యనారాయణ కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల చెక్కు అందజేయడం జరిగినది అని, ఈ స్కీం పోలీసు కుటుంబాలకు ఎంతగానో ఆర్థిక బాసటగా నిలుస్తుంది అని ఎస్పి అన్నారు. సిబ్బంది అందరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలి, ప్రమాదాలకు దూరంగా ఉండాలి, ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ప్రతి పోలీసు సిబ్బంది సాలరీ ప్యాకేజ్ అకౌంట్ గా మార్పు చేసుకోవాలని సూచించారు. ఈ స్కీం ను రూపొందించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి అభినందనలు తెలిపినారు.
ఈ కార్యక్రమం నందు అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, AO మంజు భార్గవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, పోలీసు సంఘం అధ్యక్షులు ఎస్ఐ బెల్లంకొండ రామచందర్ గౌడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు మోహన్ కుమార్, మహేష్, సిబ్బంది ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.