Take a fresh look at your lifestyle.

లోకం మెచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టును బద్నామ్ చేశారు ఎర్రవెల్లి దయాకర్ రావు

 

మహదేవపూర్, ముద్ర:

మహారాష్ట్ర ప్రభుత్వం, బిజెపి పార్టీ, యావత్తు ప్రపంచంలో మెచ్చుకున్న కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును, లక్ష కోట్లు వృధా చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం బద్నామ్ చేసిందని మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కావాలనే కక్ష్యకట్టి మేడిగడ్డ బ్యారెజ్‌ను దోషిగా చూపించి మూడేళ్లుగా తెలంగాణ రాష్ట్ర రైతంగాన్ని అన్యాయం చేశారని, ఈ విషయం ఇప్పుడిప్పుడే సమాజానికి అర్థం అవుతోందని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజ్‌ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పుట్టమధు ఆధ్వర్యంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించారు. ఆనాడు నల్గొండలో ఈనాడు జగిత్యాల సభలను ఫెయిల్‌ చేయాలని చూస్తున్నాడన్నారు. మేడిగడ్డ బ్యారేజీకి వచ్చి ఏం చేస్తడో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మూడేళ్ల నుంచి మేడిగడ్డ ప్రాజెక్టును పట్టించుకోక తెలంగాణ ప్రజలు, రైతులను రేవంత్ రెడ్డి గోస పెట్టాడన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు నిర్మించారని, 140టీఎంసీల స్టోరేజ్‌ ప్రపంచడంలో ఎక్కడా లేదన్నారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా కేసీఆర్‌ కాళేశ్వరం నిర్మించారన్నారు. రెండు పిల్లర్లకు ఇబ్బంది అయితే ప్రాజెక్టు పూర్తిగా కూలిపోయిందని ప్రచారం చేశారని ఆరోపించారు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఎన్నో నీతులు చెప్తున్నాడని, మూడేళ్లుగా ఇక్కడ ఇసుక మాఫియా నడుస్తుంటే ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ వైఫల్యం మూలంగా పొలాలు ఎండిపోతున్నాయని, సకాలంలో ఎరువులు అందడం లేదని, రైతులకు బోనస్‌ , రైతుబంధు ఇవ్వడంలేదన్నారు. అయితే ఎస్సారెస్పీ, శ్రీరాంసాగర్‌లను కాంగ్రెస్‌ కట్టింది నిజమే కావచ్చు కానీ, ఆనాడు మహరాష్ట్రలో అక్రమంగా ప్రాజెక్టులు కట్టి శ్రీరాంసాగర్‌కు చుక్క నీళ్లు రాకుండా చేసిన సమయంలో తనతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి ధర్నా చేసింది వాస్తవం కాదా అని అన్నారు. కావాలనే కక్ష్యకట్టి మేడిగడ్డ బ్యారేజ్‌ పై దుష్ప్రచారం చేశారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. పుష్కరాలు వస్తున్నాయనే బ్యారేజ్ పునరుద్దరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఉపయోగపడలేదని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని పుట్ట మధు సవాలు చేశారు. ప్రాజెక్టుకు ఖర్చు ఎంతైందో 90 వేల కోట్లు ఎక్కడ నష్టం జరిగిందో చెప్పాకే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజీ 20వ పిల్లర్‌ చిన్నగా క్రాక్‌ ఇస్తే దానిని రాద్దాంతం చేసి ప్రాజెక్టు పూర్తిగా కూలిపోయిందని విష ప్రచారం చేశారన్నారు. ఒక బ్లాక్‌లో ఏడు పిల్లర్లు ఉంటే అందులో రెండు పిల్లర్లకు ఇబ్బంది ఏర్పడిందని, దానిని మరమ్మత్తులు చేస్తే బ్యారేజీ వినియోగంలోకి వస్తుందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మేడిగడ్డ నుంచి కొండ పోచమ్మ పై వరకు కాళేశ్వరం ప్రాజెక్టులో బాగమేనని, 93వేల కోట్లు మొత్తం అక్కడ వరకు పెట్టిన ఖర్చని ఎన్నిసార్లు చెప్పినా 90వేల కోట్లు ఒక్క మేడిగడ్డకే ఖర్చయిందని, అక్కడే కూలిపోయిందని ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. చిన్న కాళశ్వరం, పోతారం వద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌లు పూర్తి చేసి మంథనికి కాళేశ్వరం నీళ్లు అనుసంధానం చేయలేక పోయామన్నారు. అలాగే మత్స్య సంపదతో కూడా వేల కుటుంబాలకు జీవనోసాధి లభించిందన్నారుకాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజ్‌ను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అధ్యక్షతన మాజీ మంత్రి డా, రాజయ్య, మాజీ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎంపీ మలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, అరూరి రమేష్, దాసరి మనోహర్ రెడ్డి, గండ్ర వెంకటరమణ రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, భూపాలపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణి, మాజీ కార్పొరేషన్ చైర్మెన్ వాసుదేవరెడ్డిలతో కలిసి ఆయన సందర్శించారు.

Leave A Reply

Your email address will not be published.