ముద్ర ప్రతినిధి, భువనగిరి : నేటి నుంచి ఈనెల 28వ తేదీ వరకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. బుధవారం
ఉదయం 10 గంటలకు విష్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధనం.
సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోపణం.19న ఉదయం 8 గంటలకు అగ్ని ప్రతిష్ట ఉదయం 11 గంటలకు ధ్వజారోహణం. సాయంత్రం 6.30 గంటలకు భేరీ పూజ, దేవతా ఆహ్వానం, హవనం నిర్వహిస్తారు. 20న ఉదయం అలంకార, వాహన సేవలకు శ్రీకారం. 9 గంటలకు మత్స్యావతార అలంకార సేవ, వేదపారాయణం. రాత్రి 7 గంటలకు శేష వాహన సేవ.
21న ఉదయం 9 గంటలకు వటపత్రశాయి అలంకార సేవ. రాత్రి 7 గంటలకు హంస వాహన సేవ చేస్తారు.
22న ఉదయం 9 గంటలకు శ్రీకృష్ణ అలంకార సేవ. రాత్రి 7 గంటలకు పొన్న వాహన సేవ.
23న ఉదయం 9 గంటలకు గోవర్ధన గిరిధారి అలంకార సేవ.రాత్రి 7 గంటలకు సింహ వాహన అలంకార సేవ. 24న ఉదయం 9 గంటలకు జగన్మోహిని అలంకార సేవ. రాత్రి 8 గంటలకు అశ్వవాహన సేవ, శ్రీస్వామి వారి ఎదుర్కోలు ఉత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.
25న ఉదయం 9 గంటలకు శ్రీరామ అలంకార (హనుమంత వాహనం) సేవ. రాత్రి 8 గంటలకు గజవాహన సేవ.రాత్రి 8.45 గంటలకు శ్రీస్వామి, అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం.
26న ఉదయం 9 గంటలకు శ్రీ మహావిష్ణువు అలంకారం, గరుడ వాహన సేవ. రాత్రి 8 గంటలకు దివ్య విమాన రథోత్సవం. 27న ఉదయం 9.30 గంటలకు మహా పూర్ణాహుతి, చక్రతీర్థం. సాయంత్రం 6 గంటలకు శ్రీ పుష్పయాగం, దేవతోద్వాసనం. 28న ఉదయం 10 గంటలకు శ్రీస్వామి వారికి అష్టోత్తర శతఘటాభిషేకం. రాత్రి 9 గంటలకు శ్రీస్వామి వారి డోలోత్సవంతో బ్రహ్మోత్సవాల సమాప్తి అవుతాయి. నేటి నుండి 28వ తేదీ వరకు ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలు, సుదర్శన నరసింహ హోమం, నిత్య కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవాలు, మొక్కు జోడు సేవలు తాత్కాలికంగా రద్దు చేశారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.