Take a fresh look at your lifestyle.

జర్నలిస్టులకు కార్పోరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందించాలి

 

షాబాద్ జర్నలిస్టుల సమిష్టి కృషి చాలా గొప్పది

టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఎండి సలీమ్ పాషా

గుండెపోటుతో మృతి చెందిన జర్నలిస్ట్ రాములు సతీమణికి రూ.8 లక్షల ఆర్థిక సాయం

సహచరునికి చేయుతనందించిన షాబాద్ విలేకరులు

(ముద్ర, ఉమ్మడి రంగారెడ్డిజిల్లా)
ప్రభుత్వం వెంటనే కార్పొరేట్ అస్పత్రుల్లో జర్నలిస్ట్ లకు ఉచిత వైద్యాన్ని అందించి ప్రాణాలు కాపాడాలని రంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యూజే అధ్యక్షులు ఎండీ సలీమ్ పాషా కోరారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల ఆంధ్రప్రభ రిపోర్టర్ రాములు మృతి ఎంతో బాధాకరమన్నారు. 3 నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన షాబాద్ మండల ఆంధ్రప్రభ రిపోర్టర్ కడుమూరి రాములుకు సోమవారం రోజు షాబాద్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో టీయూ డబ్ల్యూయూజే మండల యూనిట్ తరుపున సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు జిల్లా అధ్యక్షులు ఎండీ సలీమ్ పాషా,జిల్లా గ్రంధాలయ శాఖ చైర్మన్ మధుసూదన్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి భీమ్ భరత్, బీఆర్ఎస్ నాయకులు ఆంజనేయులు, హోప్ ఫౌండేషన్ అధ్యక్షులు కొండా విజయ్ కుమార్, మార్కెట్ చైర్మన్ సురేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

టీయూడబ్ల్యూజే ఐజేయు షాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో రాములు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. అలాగే ఆంధ్రప్రభ యాజమాన్యం మరియు నాయకులు అందరు కలిసి రాములు కుటుంబానికి 8 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసి ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. రాములు సతీమణి అలివేలు, కుమారులు వంశీ కృష్ణ, సాయికృష్ణ లకు నగదు అందించారు. ఈ సందర్బంగా రాములు కుటుంబానికి అండగా నిలిచిన షాబాద్ మండల జర్నలిస్టులకు జిల్లా అధ్యక్షులు సలీమ్ పాషా అభినందనలు తెలిపారు. పని వత్తిడి మూలంగా ఎవరు కూడా ఆరోగ్యాలను నిర్లక్ష్యం చేయవద్దని, జిల్లా లోని జర్నలిస్ట్ లకు వైద్య శిబిరాలు నిర్వహించి పలు రకాల పరిక్షలు చేయిస్తున్నట్లు తెలిపారు.చేవెళ్ల లో కూడా త్వరలో వైద్య శిభిరాన్ని నిర్వహిస్తామన్నారు.
మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ద్వారా అకాడమీ నుండి కూడా రాములు కుటుంబానికి లక్ష రూపాయల సహాయం అందించటానికి కృషి చేస్తామన్నారు.
*******

ఈ సంతాప సభలో స్థానిక సిఐ తో పాటు కురుమ సంఘం నేతలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నేతలు, ఆయా గ్రామాల సర్పంచ్ లు,మాజీ ప్రజాప్రతినిధులు, చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షులు యాదయ్య, షాబాద్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాంచంద్రయ్య, నియోజకవర్గ జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.