Take a fresh look at your lifestyle.

ఓట్లేయనందుకు పద్మశాలీ కులస్తుల ఇండ్లపై బీరు సీసాలతో దాడి..

ముద్ర ప్రతినిధి, భువనగిరి : మున్సిపల్ ఎన్నికల్లో భువనగిరి ఒకటో వార్డులోని అర్బన్ కాలనీలో బీఆర్ఎస్ తరపున ఏలె భువనేశ్వరి అనే మహిళ గెలుపొందింది. ఈ క్రమంలో ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థి స్వరూపారాణి బంధువు, రెండో వార్డు కౌన్సిలర్ అనిల్ కుమార్ అర్బన్ కాలనీ వాసులు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేయలేదంటూ దూషించారు. అంతేకాకుండా ఓటమిని జీర్ణించుకోలేక శనివారం రాత్రి పద్మశాలీ కులస్తుల ఇండ్లపై ఖాళీ బీరు సీసాలతో దాడి చేశారు. దీంతో పద్మశాలీ కులస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి పంచిపెట్టిన చీరలు, హాట్ బాక్స్లను రోడ్డు మీద పడేసి, ర్యాలీగా వెళ్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ వారితో తమకు ప్రాణ భయం ఉందంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.