ముద్ర ప్రతినిధి, భువనగిరి :
స్వర్గగిరి పుణ్యక్షేత్రం భక్తిపారవశ్యంలో మునిగితేలింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా తొమ్మిదో రోజు నిర్వహించిన మహా రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తజన సందోహం మధ్య స్వామి వారు రథారూఢుడై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుండే ఆలయంలో విశేష పూజలు నిర్వహించిన అనంతరం, వేద మంత్రోచ్ఛారణల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించిన భారీ రథంపై అధిష్టింపజేశారు. మంగళవాయిద్యాలు, భక్తజన కోలాటాల నడుమ రథం ఆలయ వీధుల్లో వైభవంగా సాగింది. భక్తులు రథం తాళ్లను పట్టుకుని లాగుతూ, “గోవిందా.. గోవిందా..” అంటూ చేసిన నామస్మరణతో స్వర్గగిరి ప్రాంతం ఆధ్యాత్మిక చైతన్యంతో నిండిపోయింది. బ్రహ్మోత్సవాల్లోనే అత్యంత కీలకమైన ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు పరిసర ప్రాంతాల నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు.
రథోత్సవం పొడవునా వివిధ జానపద కళారూపాలు, భజన మండళ్ల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రథోత్సవం పొడవునా సాగిన సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. రథం ముందు సాగిన కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారులు, మహిళలు వేసిన గోపికా నృత్యాలు, భక్తిపాటలకు అనుగుణంగా వేసిన అడుగులు ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన జానపద కళాకారుల ప్రదర్శనలు, వేషధారణలు మరియు మంగళ వాయిద్యాల హోరుతో రథయాత్ర మార్గమంతా కళకళలాడింది.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.