Take a fresh look at your lifestyle.

కొలువుతీరిన కొత్త పాలకవర్గం. చైర్మన్ గా పావుశెట్టి సునీల్ కుమార్. వైస్ చైర్ పర్సన్ గా ఏకు దివ్య

 

ముద్ర. పరకాల.

పరకాల మున్సిపాలిటీ కొత్త పాలకవర్గం కొలువుదిరింది. సోమవారం పరకాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఇటీవల జరిగిన పరకాల మున్సిపాలిటీ ఎన్నికలలో గెలుపొందిన కౌన్సిలర్లచే ఎన్నికల రిటర్నింగ్ అధికారి పరకాల ఆర్డిఓ కే నారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు.కాంగ్రెస్ పార్టీ 13 అత్యధిక స్థానాలను గెలుచుకొని చైర్మన్ వైస్ చైర్ పర్సన్ స్థానాలను సొంతం చేసుకునే విషయం తెలిసింది. సోమవారం జరిగిన చైర్మన్ వైస్ చైర్ పర్సన్ల ఎన్నికల సంబంధించి సమావేశం జరగా చైర్మన్గా పావుశెట్టి సునీల్ కుమార్ వైస్ చైర్పర్సన్ గా నాలుగో వార్డ్ అభ్యర్థి ఏక దివ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన 13 మంది కౌన్సిలర్లు , టిఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందిన ఆరుగురు కౌన్సిలర్లను , బిజెపి నుండి గెలుపొందిన ముగ్గురు కౌన్సిలర్లను ఆయన ప్రమాణం చేయించారు. అనంతరం చైర్మన్ వైస్ చైర్మన్ ల ఎన్నికలకు సంబంధించి పోటీ నిర్వహించగా కాంగ్రెస్ పార్టీ నుండి ఏడవ వాడు అభ్యర్థి పావిశెట్టి సునీల్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి, పరకాల మున్సిపాలిటీ కమిషనర్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

వైస్ చైర్ పర్సన్ గా ఏకు దివ్య.

పరకాల మున్సిపాలిటీ నాలుగో వార్డు అభ్యర్థి ఏకు దివ్యకు అనూహ్యంగా వైస్ చైర్ పర్సన్ పదవి దక్కింది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా పార్టీ కోసం పనిచేసిన 19 వ వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్ కు పరకాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పదవి దక్కుతుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా వైస్ చైర్పర్సన్ పదవి ఏకు దివ్య కు దక్కటంతో పార్టీ శ్రేణుల్లో విస్మయం గెలుపొంది. పార్టీ నుండి గెలుపొందిన కౌన్సిలర్లు మద్దతుతో ఏ కు డైవ్యకు వైస్ చైర్ పర్సన్ పదవి దక్కిందని పార్టీ వర్గాలు తెలిపాయి.

టిఆర్ఎస్ బిజెపి కౌన్సిలర్ల ధర్నా.

తమకు ఎలాంటి సమాచారం లేకుండా జరపడం పట్ల టిఆర్ఎస్ బిజెపి కౌన్సిలర్లు మున్సిపాలిటీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. గెలుపొందిన కౌన్సిలర్లచే ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పరకాల ఆర్డీవో నారాయణ ఎన్నిక ఉంటుందన్నారు. ముందుగా చైర్మన్ ఎన్నిక జరగా చైర్మన్గా ఏడవ అభ్యర్థి పావిశెట్టి సునీల్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్డీవో ప్రకటించాలని వారు తెలిపారు. అనంతరం వైస్ చైర్మన్ వెనుకకు నోటిఫికేషన్ ప్రకటించారు. సమయం దాటిపోవడంతో మంగళవారం వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందని తమను బయటకు పంపారని వారు ఆరోపించారు. తమను బయటకు పంపి అధర్మంగా ఎన్నికల నియమాలని తుంగలోటొక్కి వైస్ చైర్మన్ ఎన్నిక జరపడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ వారు మున్సిపాలిటీ ముందు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. దీంతో వారు పరకాల ఆర్డిఓ తీరును తీవ్రంగా తప్పుపడుతూ ప్రజాస్వామ్యాన్ని కూనిచేసి ఆర్డిఓ కాంగ్రెస్ పార్టీకి తొక్కగా మారారని వారు విమర్శించారు.

Leave A Reply

Your email address will not be published.