Take a fresh look at your lifestyle.

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక నేతకు నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు హాజరు కావాలని మాజీ ఎంపీ, brs పార్టీ జనరల్ సెక్రటరీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు సిట్ అధికారులు 160 CRPC కింద నోటీస్ ఇచ్చారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ లోని సిట్ కార్యాలయానికి రావాలని సూచించింది. ఫోన్ ట్యాపింగ్ కేసు కు సంబంధించిన విచారణ లో భాగంగా విచారణకు పిలుస్తున్నట్టు నోటీస్ లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సంతోష్.. కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావును సిట్ విచారించింది.

Leave A Reply

Your email address will not be published.