Take a fresh look at your lifestyle.

బాబు జగ్జీవన్ రావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. -ఎమ్మెల్యే మందు ల సామెల్.

ముద్ర మోత్కూర్:

డాక్టర్ బాబు జగ్జీవన్ రావు జయంతిని పురస్కరించుకొని మోత్కూరు మున్సిపల్ పరిధిలోనీ చెరువు కట్ట వద్ద గల బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మందుల సామెల్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషిచేసిన గొప్ప మహానుభావుడు బాబు జగ్జీవన్ రావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ గడ్డం స్వప్న, వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న, మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్, కౌన్సిలర్లు కురిమిళ్ళ ప్రమీల, సుల్తాన్ స్వామి, కొండ శోభ, మొగ్గుళ్ళ అనురాధ, గనగానీ శైలజ, పన్నాల శ్రీవిద్య, బీసు శ్రీకాంత్, కారు పోతుల వెంకన్న, మెంట రమణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.