ముద్ర, భువనగిరి ప్రతినిధి :
మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు బూసి మహేష్ మాదిగ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న మాదిగ హాజరై అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 32 సంవత్సరాల నుండి ఏబిసిడి వర్గీకరణ సాధనకై పోరాడి వారి ఆత్మ బలిదానాల త్యాగ ఫలమే ఈనాటి వర్గీకరణ అని, నేటి వర్గీకరణ అమరులకు అంకితం అని అమరులను స్మరించుకున్నారు. ఈ ప్రభుత్వం మాదిగ అమరవీరుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా దళిత పీడిత వర్గాలపై ఎవరైతే అగ్రకులాల దుండగులు దాడి చేస్తున్నారో వాళ్ళని వెంటనే శిక్షించి జైల్లో వేసే విధంగా చొరవ చూపి దళితులను ఆదుకోవాలని అన్నారు. అదేవిధంగా మార్చి 27న ఎస్సీ సంక్షేమ పథకాల సాధనకై నిరాహార దీక్ష కరపత్రాన్ని ఆవిష్కరించారు. మార్చు 9న అన్ని జిల్లా కలెక్టరేట్లకు సంక్షేమ పథకాల అమలుకై మెమోరెండం ఇవ్వాలని జిల్లా నాయకులకు సూచన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కూరెళ్ళ రమేష్ మాదిగ, రాష్ట్ర కార్యదర్శి, బైరపాక నాగరాజు మాదిగ, మాదిగ యువసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
క్యాసగల్ల రమేష్ మాదిగ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సంగి స్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి బొట్ల శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి గుర్రం, బైరపాక సురేష్, మోటకొండూరు మండల అధ్యక్షులు వంగపల్లి చిరంజీవి, ఆలేరు మండల అధ్యక్షులు ముద్దపాక కృష్ణ, యాదగిరిగుట్ట మండల అధ్యక్షులు, వడ్లకొండ శ్రీకాంత్, బొట్ల అనిల్, బోగారం మురళి,బొట్ల పరమేష్, నత్తి కృష్ణ, సంఘ గణేష్, కొంగరి రామచందర్ పాల్గొన్నారు.
Prabhakar is a sub Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.