Take a fresh look at your lifestyle.

ఆరెకటిక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ కి ఘనంగా సన్మానం

ముద్ర, భువనగిరి ప్రతినిధి :
భువనగిరి పట్టణంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆరెకటిక సంఘం అధ్యక్షులు హీరే కార్ శ్రీను ఆధ్వర్యంలో భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీ వాణి రవికుమార్ కి ఘన సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా హీరే కార్ శ్రీను మాట్లాడుతూ ఆరెకటిక సంఘం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పట్టణ అభివృద్ధిపై చైర్మన్ దృష్టి సారించాలని మా సంఘం అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆరెకటిక సంఘం నాయకులు హీరే కార్ శేఖర్, గట్కరి శ్రీకాంత్, ఇల్లు గౌలికార్ నర్సింగ్, మంతూర్ కార్ రాము, జయ కృష్ణ, బబ్లు, రాజేశ్వర్, సాయికిరణ్, అమిత్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.