బోడుప్పల్, ముద్ర విలేకరి: బోడుప్పల్ పెంటారెడ్డి కాలనీలోని నిమిషాంబికా ఆలయంలో గురుపౌర్ణమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ సముదాయంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి, సాయిబాబా స్వామివార్లకు పంచామృతాభిషేకం, భస్మాభికేకం, గంధాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.మంగళహారతి, నీరాజనం, మంత్రపుష్పం, ఆశీర్వచనం తర్వాత హాజరైన భక్తులకు ప్రసాద వితరణ చేశారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఆలయ ప్రధానార్చకులు చంద్రశేఖర శర్మ ఆధ్వర్యంలో భక్తులచే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు.ఈ కార్యక్రమాలలో ఆలయ చైర్మన్ కామరౌతు వినోద్ కుమార్ తో పాటు, రాష్ట్ర నకాష్ సంఘం ప్రధాన కార్యదర్శి కొరిచర్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
