ముద్ర, గద్వాల:
కేటిదొడ్డి గ్రామంలోని ఊరొద్ద వాగు పై హై లేవల్ వంతెన నిర్మాణానికి శనివారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి స్థానిక రైతులతో కలిసి ఊరొద్ద వాగును సందర్శించారు. వర్షాకాలంలో అధిక వర్షాలతో వాగులు ఉధృత్తంగా ప్రవహిస్తున్న క్రమంలో పొలాలకు వెళ్లే రైతులకు ఇబ్బందులుగా మారుతోందని, గ్రామంలో వరద నీరు వచ్చిచేరే అవకాశం ఉందని, రైతులకు, ప్రజలకు ఇబ్బందులు తలెతుతున్న సమస్యలను స్థానిక నేతలు, రైతులు గద్వాల ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన గద్వాల ఎమ్మెల్యే శనివారం ఊరొద్ద వాగు బాటను పరిశీలించారు. ఊరొద్ద వాగుపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి, త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
ఎమ్మెల్యే వెంటా గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ హనుమంతు, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజశేఖర్, కేటిదొడ్డి సర్పంచు నారాయణ, వార్డు మెంబర్లు, నాయకులు ఉరుకుందు, చంద్రశేఖర్, యుగంధర్ గౌడ్,,ఉలిగప్ప, బి కొండయ్య, గోపాల్, డి వీరేష్, హెచ్ వీరేష్, హెచ్ తాయప్ప, పిల్లిశ్రీను అంజి, భీమేష్, డబల్ బాయ్ వీరన్న, వీరేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.