ముద్ర, గండిపేట్ : నార్సింగి మున్సిపాలిటీలో ప్రజల సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం జరుగుతుందని రాజేంద్రనగర్ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ అన్నారు.మున్సిపాలిటీలో ప్రాంతం సమగ్ర అభివృద్ధి సాధించే దిశగా ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్డు నెట్వర్కు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడం,కాలనీలలో దీర్ఘకాలికంగా ఉన్న డ్రైనేజీ సమస్యలను పరిష్కరించడం తన లక్ష్యమని అన్నారు.బుధవారం నార్సింగి మున్సిపల్ కార్యాలయంలో సమావేశంలో మాట్లాడారు.రూ.81 కోట్లతో మున్సిపల్ లో ఆవశ్యకమైన అభివృద్ధి పనులను త్వరితగతిన చేయడానికి ఆదేశించామన్నారు.రూ.20 కోట్లతో కోకాపేట్ విజేత సూపర్ మార్కెట్ ఎదురుగా ఉన్న బ్రిడ్జి నిర్మాణంతో పాటు అప్రోచ్ రోడ్డు అభివృద్ధి సుందరీకరణ, రూ.11.50 కోట్ల తో రాయల్ ఫంక్షన్ హాల్ నుండి నార్సింగ్ జంక్షన్ వరకు ప్రస్తుతం ఉన్న బీటీ రోడ్డు వెడల్పు,ఫుట్ పాత్ నిర్మాణం డివైడర్ నిర్మాణం,రూ.13 కోట్లతో కోకాపేట్ సర్కిల్ నుండి గండిపేట్ సాయిబాబా గుడి వరకు బీటీ రోడ్డు వెడల్పు ఫుట్పాత్ నిర్మాణం డివైడర్ నిర్మాణం, రూ.10 కోట్లతో మంచిర్యాల బాలాజీ నగర్ యందు మెయిన్ రోడ్డు కల్వర్టు నుండి మూసీ నది వరకు బాక్స్ నిర్మాణం,రూ.1.50 కోట్లతో నార్సింగిలో ఆవు దూడ జంక్షన్ నిర్మాణం, రూ.8 కోట్లతో నార్సింగ్ లో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేయుట, రూ.5 కోట్లతో నార్సింగి లో మూడు ఎకరాలలో పిల్లలకి పెద్దలకు అనువుగా తగు సౌకర్యాలతో పార్కుని ఏర్పాటు చేయుట, అల్లు స్టూడియో నుంచి గ్లోబల్ హెడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ వరకు బీటీ రోడ్డు నిర్మాణము,మంచిరేవులలో 2 జంక్షన్ల నిర్మాణము,పుల్కాపూర్ నాలా పునరుద్ధరణ, నార్సింగి పురపాలక సంఘ పరిధిలో ఇదివరకే మొదలుపెట్టి అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం పూర్తి చేయుట,నార్సింగిలో రోడ్డు బ్రిడ్జి నిర్మాణం చేయుట వంటి పనులన్నీ త్వరితగతిన చేపట్టుటకు కమిషనర్ ను ఆదేశించామన్నారు.ఈ సమావేశంలో ముదిరాజ్ కమిషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్, నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ వేణు గౌడ్, గుడిమల్కాపూర్ మార్కెట్ చైర్మన్ మల్లేశం,మున్సిపల్ మాజీ చైర్మన్ నాగపూర్ణ శ్రీనివాస్, మాజీ వైస్ చైర్మన్ విజయ్ బాబు, మాజీ కౌన్సిలర్లు, అమరేందర్ రెడ్డి, శివారెడ్డి, నార్సింగి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అశోక్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, డీఈ నరేష్, టిపిఓ మణిహారిక, తదితరులు పాల్గొన్నారు.