- డీఆర్డిఓ శాస్త్రవేత్త మురళీ మోహన్ గాదె
- సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో “సిద్దహస్త 2కె25”
ముద్ర,ఇబ్రహీంపట్నం:విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే అంశాలపై పరిశోధనలు చేసి సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని డీఆర్డిఓ శాస్త్రవేత్త మురళీ మోహన్ గాదె పిలుపునిచ్చారు.ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని వినోభనగర్ లో ఉన్న సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో “సిద్దహస్త 2కె25” పేరిట సాంకేతిక సదస్సు నిర్వహించారు.ఈ సదస్సుకు హాజరైన ఆయన మాట్లాడుతూ నిద్యార్థులు కొత్త సాంకేతికతలను అనుసరిస్తూ,పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తమను తాము అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.మానవాళికి ఉపయోగపడే విధంగా నూతన ఆవిష్కరణలో కు శ్రీకారం చుట్టాలని అన్నారు.ముందుగా విద్యార్థులు పలు సాంకేతిక క్విజ్, కోడ్ డీబగ్గింగ్, ప్రాజెక్ట్ ఎక్స్‌పో, పోస్టర్, పేపర్ ప్రెజెంటేషన్ వంటి సాంకేతిక కార్యక్రమాలు చేపట్టారు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం లో విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ అంశాలపై పోస్టర్ ప్రజెంటేషన్ ప్రదర్శించారు.సాంకేతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శేఖర్ బాబు, డైరెక్టర్ జి భగత్, సదస్సు కన్వీనర్ డా వెంకటేశం మారగొని, డా లక్ష్మీదేవి, ప్రొఫెసర్ నర్సింహ రెడ్డి, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాలకులు, విద్యార్థులు పాల్గొన్నారు.