Take a fresh look at your lifestyle.

ప్రతి నిరుపేద సొంత ఇంటి కల సాకారం చేస్తాం

  • కాంగ్రెస్ పార్టీ చేతల ప్రభుత్వం..మాటల ప్రభుత్వం కాదు.
  • గత పాలకుల వైఫల్యాలతో సొంత ఇంటికల దశాబ్ద కాలం ఆలస్యం.
  • మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ది దారులకు స్థానిక దేవిశ్రీ గార్డెన్ లో నిర్వహించిన సమావేశానికి మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జీవన్ రెడ్డి ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదల సొంత ఇంటి కల సాకారం చేయాలనే సంకల్పంతో ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించామని,లబ్ధదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టామని అన్నారు.అర్హత ఉన్నప్పటికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకానీ వారూ ఆందోళన చెందవద్దని, భవిష్యత్ లో తప్పనిసరిగా ఇల్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్కో నియోజక వర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు కేటాయించింది.ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు మంజూరు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించి, ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తోందని అన్నారు.ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా అర్హతకు అనుగుణంగా ఇల్లు పారదర్శకంగా మంజూరు చేశామన్నారు.ఇళ్ల మంజూరు ప్రతిపాదన ఎవరు చేసిన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇల్లు మంజూరు చేస్తుందని అన్నారు.గత ప్రభుత్వం కేవలం మాటలతో కాలం వెలిబుచ్చింది.పారదర్శకంగా, అర్హతకు అనుగుణంగా నిజమైన లబ్ధిదారులు లబ్ది పొందేలా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు మార్గదర్శకాలు రూపొందించారు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో ఏ కార్యక్రమం చేపట్టిన అర్హత ప్రాతిపదికన అమలు చేశారు.సీఎం రేవంత్ రెడ్డి పాలన లో కూడా అన్ని సంక్షేమ పథకాలను అర్హతకు అనుగుణంగా సంపూర్ణంగా అమలు చేయడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమన్నారు.సంక్షేమ పథకాలకు ఆధారమైన రేషన్ కార్డుఅర్హత ప్రతిపాదికన రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు అందజేస్తున్నాం.సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు కొలతబద్ధ.విద్యా, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, సేవలు పొందేలా రేషన్ కార్డు అందిస్తున్నాం.అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తున్నాం.గతంలో పంపిణీ చేసిన బియ్యం లబ్ధిదారులు వినియోగించుకోలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుపేదల కడుపు నింపాలనే సంకల్పం తో సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది.సన్న బియ్యం పంపిణీ చేస్తారని ఎవరు ఊహించలేదు.
దేశంలోనే సన్న బియ్యం పంపిణీ చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మొదటిది అని అన్నారు.జగిత్యాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేసినం.జగిత్యాల విద్యా హబ్ గా మారింది.వ్యవసాయ కళాశాల ఇంజనీరింగ్ కళాశాల ఐటీఐ అడ్వాన్స్ టెక్నాలజీ గా అప్గ్రేడ్ చేయడంతో పాటు నాక్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసుకున్నాం.ప్రపంచ స్థాయి నాణ్యత తో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నాం.ప్రతి జిల్లా లో వైద్య కళాశాల ఏర్పాటు తో వైద్య సేవలు విస్తృతమయ్యాయి. ఏ సంక్షేమ కార్యక్రమం అయినా జగిత్యాల నాంది పలుకుతుంది.2008-09 లో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు మంజూరు చేసేందుకు స్థలం సేకరించి నాలుగు వేల మందికి 100 గజాల స్థలం అందజేసినం.రాష్ట్రంలో నాలుగు వేల మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేసిన ఘనత జగిత్యాల కు మాత్రమే దక్కింది.
వారసత్వంగా హక్కు కల్పించేలా సొంత స్థలం అందజేసినం.సొంత ఇల్లు పూర్తి చేసి ఉంటే నాలుగు వేల మందికి సొంత ఇల్లు దక్కేవి.నాలుగు వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తే కాంగ్రెస్ పార్టీ కి పేరు వస్తుందని గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూం తెర పైకి తీసుకు వచ్చింది.పదేళ్లు గడిసినా మౌలిక వసతులు మాత్రం కల్పించలేదు.గత బీ ఆర్ ఎస్ నాయకులు రెండు ఏళ్ల కింద ఎన్నికల ముందు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. మౌలిక వసతులు కల్పించలేదు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యతగా భావించి నూకపల్లి డబుల్ బెడ్ రూం ఇళ్లల్లో మౌలిక వసతుల కల్పన కోసం నిధులు మంజూరు చేసిందని తెలిపారు.పాఠశాలలు, ప్రార్థన మందిరాలు ఏర్పాటు చేస్తాం.కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు..చేతల ప్రభుత్వం అని స్పష్టం చేశారు.నాలుగు వేల మంది నిరుపేదల ఇల్లు పూర్తికాకపోవడం గత పాలకుల వైఫల్యం కాదా అని ప్రశ్నించారు.అర్హత ప్రాతిపదికన ఇళ్ల పట్టాలు మంజూరుచేసి, కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యతగా భావిస్తోంది.కాంగ్రెస్ పార్టీ పారదర్శకతకు నిదర్శనం. ఇందిరమ్మ నిరుపేదలకు గ్రామ గ్రామాన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల కు 4 శాతం కల్పించింది.ఉమ్మడి రాష్ట్రంలో బలహీన వర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్ ఉంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత బీ ఆర్ ఎస్ 23 శాతానికి కుదించారు.కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన చేపట్టి,డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కృషి చేసింది. 42 శాతం రిజర్వేషన్ అమలుకు 9 వ షెడ్యూల్ లో చేర్చాలి బాధ్యత కేంద్రం పై ఉన్నప్పటికీ చొరవ చూపడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేసేందుకు గత్యంతరం లేక ఆర్డినేస్ జారి చేయాల్సి వచ్చింది.స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తాం.గత దశాబ్దా కాలంగా బీ ఆర్ ఎస్ అరాచకాలకు ఎదురుగా పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గుర్తింపు ఇస్తుంది. మున్సిపల్ ఛైర్పర్సన్ ఎందుకు రాజీనామా చేశారో తెలియదు కానీ గత పాలకులు బలహీన వర్గాల ప్రజలకు కేటాయించిన సీట్ పునరుద్ధరించలేదు.కాంగ్రెస్  పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి చట్టంలో మార్పులు చేయించి, బలహీన వర్గాలకు కేటాయించిన సీటు భర్తీ చేయించిన అని గుర్తు చేశారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అధికారుల పాత్ర కీలకమైంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు సకాలంలో పూర్తి చేసేలా అధికారులు చొరవ తీసుకోవాలి.ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు మంజూరు చేసేలా ప్రభుత్వం కృషి చేస్తుంది అని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.